ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కరణం బలరాం

  • 10 రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరిన బలరాం
  • అంతకు ముందే కరోనా బారిన పడ్డ కరణం వెంకటేశ్
  • కొన్ని రోజులు హైదరాబాద్ నివాసానికే పరిమితం కానున్న బలరాం
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కరోనా నుంచి కోలుకున్నారు. 10 రోజుల క్రితం బలరాంకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ఆయన చికిత్స తీసుకున్నారు. ఆయన కంటే ముందే ఆయన కుమారుడు వెంకటేశ్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే, హోం ఐసొలేషన్ లోనే ఉంటూ చికిత్స తీసుకుని వెంకటేశ్ కోలుకున్నారు. కానీ, బలరాం పరిస్థితి సీరియస్ కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నెగెటివ్ రావడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే వయసు కారణాల రీత్యా హైదరాబాదులోని తన నివాసానికే కొన్నాళ్ల పాటు బలరాం పరిమితం కానున్నారు.

Karanam Balaram
Telugudesam
YSRCP
coro

More Telugu News